జాతీయ వార్తలు

జేపీసీ వేసే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: రాఫెల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తిరస్కరించారు. ఓటమి వీరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్‌గా ఆయన దానిని కొట్టిపడేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి నాలుగు రోజులు పలు నిరసనల నేపథ్యంలో జరగకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ రఫెల్ ఒప్పందం చర్చల పేరుతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దీనిని కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ జేపీసీ కోసం డిమాండ్ చేయడం అర్థం లేదని అన్నారు. ఒప్పందం చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని, ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ కోర్టు చెప్పిన దానిని తప్పు పట్టజాలదని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ బ్లాగ్‌లో ‘రాఫెల్- అబద్ధాలు, స్వల్పకాల అబద్ధాలు, ఇప్పుడు మరిన్ని అబద్ధాలు’ శీర్షికన ఆయన సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేయడం, దానిని కాగ్ పరిశీలించిందనడం, ఇప్పుడు దానిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించాలనడంపై విమర్శలు గుప్పించారు. రక్షణ ఒప్పంద వ్యవహారాలను కాగ్ కేవలం ఆడిట్ ఉద్దేశంతోనే పరిశీలిస్తుందని, తర్వాత దానిని పీఏసీకి సమర్పిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు రఫెల్‌కు సంబంధించి రిపోర్టు కాగ్ వద్ద పెండింగ్‌లో ఉందని, అది నివేదిక ఇచ్చిన వెంటనే పీఏసీకి పంపిస్తామన్నారు. ఇదే విషయాన్ని తాము కోర్టుకు సైతం విన్నవించామన్నారు. అయితే కాగ్ రిపోర్టుకు కోర్టు తీర్పుకు ఎలాంటి సంబంధం లేదని, కాని కేసు ఓడిపోయిన వారు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరని జైట్లీ పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో తమపై కేసు వేసి ఓడిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తీర్పుపై కొత్తకొత్త సందేహాలు లేవనెత్తుతోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానిని పునః పరిశీలించాల్సింది కోర్టే తప్ప మరో సంస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. అటువంటప్పుడు జేపీసీని ఏర్పాటు చేయడం వల్ల ఏమిటి ఉపయోగమని ఆయన ప్రశ్నించారు. కోర్టు చెప్పిన దానిని సరిచేయడం కాని, అందులో లోపాలు వెతకడం కాని జేపీసీ ఎలా చేస్తుందన్నారు. రాఫెల్ విమానాల కొనుగోలు ధరలకు సంబంధించి రక్షణపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున వాటిని వెల్లడించడం లేదని, ఆ విషయాన్ని కోర్టు సైతం అంగీకరించిందని కేంద్రం ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు.