జాతీయ వార్తలు

భారత అమరవీరులకు బంగ్లాదేశ్ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 16: భారత్-పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో వీరత్వం చూపి అసువులు బాసిన 12మంది భారత సైనికులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం విజయ్ దివస్ సందర్భంగా ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ దేశ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఎంఎం నారవనే మాట్లాడుతూ భారత సైనికుల త్యాగాన్ని బంగ్లా ప్రభుత్వం మరువదని, వారి త్యాగం తమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. భారత్ సైనికులకు నివాళి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, దీంతో తమ రెండు దేశాల మైత్రి బంధం సైతం మరింత పటిష్టం అవుతోందని అన్నారు. తమ భూభాగం ధ్వంసం చేస్తున్న పాక్ నుంచి భారత్ తమదేశాన్ని రక్షించిందని అన్నారు. వాస్తవానికి రెండు దేశాల మధ్య ఏర్పడిన గొడవ మధ్యలో మూడో దేశం జోక్యం చేసుకోదని, కాని ఇక్కడ భారత్ జోక్యం చేసుకుని పాక్‌తో యుద్ధం చేసి తమకు విముక్తి కల్పించిందని అన్నారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 1600 మంది భారత్ సైనికులకు నివాళి అర్పించి గౌరవించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయానికి, బంగ్లా ఏర్పడిన దినానికి గుర్తుగా విజయ్‌దివస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏడుగురు భారత ఆర్మీ సైనికుల కుటుంబాలు, రెండు వైమానిక దళం, రెండు బిఎస్‌ఎఫ్, ఒక నేవీ వ్యక్తికి బంగ్లాదేశ్ మంత్రి ఎకెం మొజమ్మల్‌హక్ ఇక్కడి ఆర్మీ ఈస్ట్రన్ హెడ్‌క్వార్టర్‌లో షీల్డులను అందజేశారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత్‌కు చెందిన అధికారులు, అమరవీరులకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.