జాతీయ వార్తలు

సల్మాన్ ఖాన్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్, జూలై 25: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఊరట లభించింది. 1998లో జోధ్‌పూర్‌లో కృష్ణ జింకలను వేటాడినట్లు అభియోగాలు ఉన్న రెండు కేసులలో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. చనిపోయిన కృష్ణ జింకల నుంచి సేకరించిన తూటాలు సల్మాన్ ఖాన్ లైసెన్స్‌డ్ గన్‌నుంచి కాల్చినవి కాదని హైకోర్టు పేర్కొంది. సల్మాన్ ఖాన్, అతని సహచర నటులు కృష్ణ జింకల వేటకోసం ఉపయోగించినట్లుగా పేర్కొంటున్న జీపు డ్రైవర్, ఈ కేసుల్లో ప్రధాన సాక్షి దులాని విచారణకు హాజరు కాకపోవడంతో ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలయిన రెండు కేసులు వీగిపోయాయి. 50 ఏళ్ల సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 2007లో సుమారు వారం రోజుల పాటు జైలులో ఉన్నారు. భవద్, మతానియాలలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారించడాన్ని సవాలు చేస్తూ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన అప్పీలును విచారించిన హైకోర్టు ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్‌కు వ్యితిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ జిత్ కౌర్ తోసిపుచ్చారు. 1998 సెప్టెంబర్ 26-27 తేదీలలో భవద్ గ్రామంలో రెండు కృష్ణ జింకలను, 28-29 తేదీలలో మతానియా (గోధా ఫామ్)లో ఒక కృష్ణ జింకను వేటాడినందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టంలోని సెక్షన్ 51కింద సల్మాన్ ఖాన్‌పై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ట్రయల్ కోర్టు (సిజెఎం) ఈ రెండు కేసులలో సల్మాన్‌ను దోషిగా ప్రకటిస్తూ 2006లో తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సల్మాన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా, మతానియా కేసులో అతని అప్పీలును తిరస్కరించిన ట్రయల్ కోర్టు భవద్ కేసులో అప్పీలును హైకోర్టుకు బదిలీ చేసింది. అప్పటికే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రెండు అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు పిటిషన్లపై విచారణను 2016 మే 13న పూర్తిచేసిన హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ జిత్ కౌర్ తన తీర్పును వాయిదా వేశారు.