జాతీయ వార్తలు

ఆశలు వదులుకున్నట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/చెన్నై, జూలై 25: గత నాలుగు రోజులుగా విస్తృత ఉపరితల అనే్వషణ జరుపుతున్న వైమానికి దళ రవాణా విమానం ఎఎన్-32 జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల్లో ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయ. ఇప్పటివరకూ ఇటు శకలాలు గానీ, అటు ప్రయాణికుల ఆనవాళ్లు గాని కనిపించకపోవడంతో ఈ నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఉపరితలంపైనే సాగిన అనే్వషణలను ఇక సముద్ర గర్భంలోకి వెళ్లి గాలింపుచేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు కోస్ట్‌గార్డ్ కమాండర్(ఈస్ట్) ఇన్‌స్పెక్టర్ జనరల్ రజన్ బర్గోత్రా తెలిపారు. నాలుగు రోజుల క్రితం చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయర్ వెళ్తూ మార్గం మధ్యలో అదృశ్యమైన వైమానిక దళ రవాణా విమానం ఎఎన్-32 జాడ ఇంకా తెలియలేదు. 29 మంది ప్రయాణికులతో గల్లంతైన ఈ విమానానికి సంబంధించిన శిథిలాలు గానీ, బతికిఉన్న వారి లేదా మృతుల ఆనవాళ్లుగాని తెలియలేదని తీరరక్షణ దళ అధికారి సోమవారం తెలిపారు. అనే్వషణ కార్యక్రమంలో 13 నౌకలు, రెండు కోస్డ్‌గార్డ్ నౌకలు నిమగ్నమయ్యాయని, మరోపక్క విమానాల ద్వారా కూడా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. అయినా ఇంత వరకూ విమాన శిథిలాలుగాని, ప్రయాణికులకు సంబంధించిన ఆనవాళ్లుగాని కనిపించలేదన్నారు. అయినప్పటికీ కూడా శక్తివంచనలేకుండా విమానం ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కొనసాగిస్తున్నామన్నారు. మొదటి మూడు రోజులూ ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆదివారం నుంచి పరిస్థితి కొంత మెరుగైందని గాలింపుచర్యలు ముమ్మరం చేశామన్నారు. మరోపక్క భారత వైమానిక దళం సోమవారం విస్తృత స్థాయిలో గగనతల అనే్వషణ జరిపింది.

చిత్రం.. జాడ తెలియకుండా పోయన వైమానికి దళ విమానం అణ్వేషణ గురించి వివరిస్తున్న కోస్ట్‌గార్డ్ కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రజన్ బర్గోత్రా