జాతీయ వార్తలు

గొడవ.. గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పార్లమెంటు ఉభయ సభలు సోమవారం కూడా అధికార, ప్రతిపక్షం సభ్యుల నినాదాలతో దద్దరిల్లిపోయాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే, అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ గొడవ చేశారు.
తెలుగుదేశం సభ్యులు ప్రత్యేక హోదా కోసం నినాదాలిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. రాఫెల్ ఒప్పందంపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ, దాని మిత్రపక్ష సభ్యులు పార్లమెంటులో గొడవ చేశారు. దీనితో ఉభయ సభల్లో పెద్దఎత్తున గందరగోళం నెలకొన్నది. ఈ గొడవల మూలగా రాజ్యసభ సోమవారం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగి మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం ఇరుపక్షాల గొడవ, గందరగోళం మూలంగా రెండుసార్లు వాయిదా పడినా ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు ట్రాన్స్‌జెండర్ బిల్లుపై స్వల్ప చర్చ జరిపి ఆమోదించారు.
లోక్‌సభ సోమవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే కాంగ్రెస్, అన్నా డీఎంకే, తెలుగుదేశం తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు వచ్చి సభ దద్దరిల్లేలా నినాదాలిచ్చారు. రాఫెల్ దర్యాప్తుకు జేపీసీని నియమించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు నినాదాలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు, మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని అన్నా డీఎంకే సభ్యులు నినాదాలిచ్చారు. కొందరు ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అడ్డంగా పెట్టారు. రాఫెల్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ, దాని మిత్రపక్షాల సభ్యులు నినాదాలిచ్చారు. దీనితో సభను ఐదు నిమిషాలపాటు నిర్వహించిన అనంతరం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు స్పీకర్ నినాదాలు, గొడవ మధ్యనే ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించేందుకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అనుమతి ఇచ్చారు. అనంతరం సభ గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశం కాగానే ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ బిల్లుపై చర్చ జరిపారు. గొడవ, గందరగోళం మధ్యనే ట్రాన్స్‌జెండర్ బిల్లుపై చర్చ జరిపి ఆమోదింపజేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.