జాతీయ వార్తలు

ఇతరులకూ శిక్ష పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషులకు హైకోర్టు శిక్ష విధించడంపై బాధిత కుటుంబ సభ్యుల్లో సంతోషం వ్యక్తమైంది. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో బాధితులపై ఎన్నో వత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయి. సోమవారం నాటి తీర్పు తమకు ఉపశమనమేనని వారు వ్యాఖ్యానించారు. మారణకాండలో కుటుంబ సభ్యులను కోల్పోయిన జగ్దీష్ కౌర్, నర్‌ప్రీత్‌కౌర్ తీర్పు వెలువడిన తరువాత మీడియాతో మాట్లాడారు. ‘సజ్జన్, తదితరులు యావజ్జీవశిక్ష మాకు సంతోషాన్ని కలిగింది. అయితే ముసుగులేని దొంగలున్నారు. వారికి శిక్ష పడాలి’అని అన్నారు. వారి కోసం తమ న్యాయపోరాటం సాగుతుందని వారు ప్రకటించారు. ‘ఈ తీర్పు మాకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది’అని కౌర్ స్పష్టం చేశారు. 1984నాటి ఘటన తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిందని జద్గీష్ కౌర్ కంటతడి పెట్టారు. ఈనాటి అల్లర్లలో కౌర్ భర్త, కుమారుడు, ముగ్గురు కజిన్స్ చనిపోయారు. కంటోనె్మంట్‌లోని రాజ్‌నగర్ ఫేజ్-1లో పాలం కాలనీలో ఐదుగురు హత్యకు గురయ్యారు. కేహర్ సింగ్, గుర్‌ప్రీత్ సింగ్, రఘువీందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్‌ను ముష్కరులు హత్య చేశారు. తన కళ్ల ఎదుటే తండ్రిని సజీవదహనం చేశారని నర్‌ప్రీత్ కౌర్ తెలిపారు. అల్లరి మూకలు ఎక్కడికక్కడ రెచ్చిపోయి ఇళ్లను తగలబెట్టడం, ఓ వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారని ఆమె వాపోయారు. ఇలాంటి దుర్మార్గులకు హైకోర్టు విధించిన తీర్పు తమకు స్వల్ప ఊరట అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న కౌర్ అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి పలు జైళ్లకు తిప్పారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా దోషులుకు శిక్ష పడేవరకూ తమ న్యాయపోరాటం ఆగదని ఆమె ప్రకటించారు.
చిత్రం.. కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ యావజ్జీవ శిక్ష పడిన నేపథ్యంలో
స్పందిస్తున్న ఢిల్లీ అల్లర్ల బాధిత కుటుంబ సభ్యులు