జాతీయ వార్తలు

2019 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: కేంద్రంలోని ఏన్డీయే ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, లౌకిక శక్తులతో కలిసి 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలలో చర్చించిన అంశాలపై ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులకు వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలిసి నడిచేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల అనంతరమే బీజేపీ వ్యతిరేక కూటమి గురించి ఆలోచిస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో మత విద్వేశాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను తీసుకెళ్లడం అందులో భాగమేనని మండిపడ్డారు. హిందూత్వ ఓట్లు సంఘటిత పరుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన మోదీ సర్కారు తీవ్రంగా కృషిచేస్తోందని అన్నారు. రాఫెల్ ఒప్పందంపై ప్రభుత్వం సుప్రీం కోర్టును పూర్తిగా తప్పుదోవ పట్టించిందని ఆయన విమర్శించారు. ఈ వివాదం విషయంలో జేపీపీ వేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించినట్టు చెప్పారు. అయితే తెలంగాణలో సీట్లు, ఓట్లు గత ఎన్నికల కంటే తగ్గండంపై లోతుగా చర్చించినట్టు వెల్లడించారు. తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ తాజా ఎన్నికల ఫలితాలపై ప్రాథమిక నివేదిక అందజేసిందని, పూర్తిస్థాయి నివేదిక మరిన్ని రోజుల్లో రాష్ట్ర పార్టీ అందజేస్తుందని చెప్పారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు బాద్యులైన కాంగ్రెస్ నాయకులకు కోర్టు శిక్ష విధించడంపై ఏచూరి హర్షం వ్యక్తం చేశారు.