జాతీయ వార్తలు

మోదీని నిద్రపోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత దేశంలోని రైతులందరి రుణాలు మాఫీ చేయిస్తాం.. మోదీ చేయకపోతే మేం అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ- రైతుల రుణాలు మాఫీ చేసేంతవరకు నరేంద్ర మోదీని నిద్రపోనివ్వం అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందనే సమాచారం తెలిసినందుకే రాహుల్ మంగళవారం ఈ ప్రకటన చేశారని అంటున్నారు. రుణాల విషయంలో రైతులెవ్వరూ భయపడవద్దు.. మీ వెంట మేమున్నాం.. రుణ మాఫీ చేసేందుకు ప్రతిపక్షమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయదని రాహుల్ తెలిపారు. ఇటీవల తమ పార్టీ
అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల్లో రైతు రుణాలు మాఫీ చేశాం.. మరో రాష్ట్రంలో కూడా త్వరలోనే మాఫీ చేస్తాం అని ప్రకటించారు. మిత్రిపక్షాలు అధికారంలో ఉన్న కర్నాటకలో కూడా రైతు రుణాలు మాఫీ చేయించామని రాహుల్ చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీచేసి తీరుతాం.. ఇది తన హామీ అని ఆయన ఆవేశంతో చెప్పారు. నూటికి నూరుపాళ్లు రైతు రుణ మాఫీ జరుగుతుందన్నారు. నరేంద్ర మోదీ గత నాలుగేళ్లలో పెద్ద, పెద్ద వ్యాపారస్థుల రుణాలు మాఫీ చేశారు.. కానీ రైతు రుణాలకు సంబంధించిన ఒక్క రుపాయి రుణం కూడా మాఫీ చేయలేదని ఆయన ఆరోపించారు. రైతుల రుణాలు మాఫీ చేసేంతవరకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఎన్‌డీఏ ప్రభుత్వంతో పోరాడుతామని రాహుల్ చెప్పారు. ఈ దేశం కేవలం 15 పదిహేను మంది బడా పారిశ్రామికవేత్తలది కాదు.. అందరిదీ.. అందుకే రైతుల రుణ మాఫీ జరిగేంతవరకు నరేంద్ర మోదీతో తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మూడున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలను మోదీ మాఫీ చేశారు.. ఈ బడా పారిశ్రామికవేత్తల్లో అనిల్ అంబాని కూడా ఉన్నారని రాహుల్ చెప్పారు. అనిల్ అంబాని వివిధ బ్యాంకుల నుండి 45వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.. ఈ రుణాలను రాబడితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రైతుల రుణాలను సునాయాసంగా మాఫీ చేయవచ్చునని రాహుల్ ప్రకటించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రజాడబ్బును అపహరించి అనిల్ అంబాని జేబులో వేశారని విమర్శించారు. రాఫెల్‌పై విచారణ జరుగుతుంది.. జేపీసీని నియమించవలసిందేనని ఆయన అన్నారు. రాఫెల్‌పై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ఎందుకు సిద్ధపడటం లేదు? ఎందుకు పారిపోతోందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. పెద్దనోట్ల రద్దు ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణమని రాహుల్ ఆరోపించారు.

చిత్రం..పార్లమెంటు వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న రాహుల్