జాతీయ వార్తలు

రామమందిరం ఎప్పుడు నిర్మిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి స్థలంలో రామమందిరాన్మి ఎప్పుడు నిర్మిస్తారు? దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? అని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఇక్కడ మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలువురు నేతలు రామమందిరాన్ని నిర్మించేది ఎప్పుడంటూ ముక్తకంఠంతో నిలదీశారు. వారిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సముదాయించారు. మందిరాన్మి నిర్మించాలన్నదే అందరి అభిమతమని, అయితే దీనిపై కొంత సహనం వహించాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్ర కుషావహ, హరినారాయణ రాజభర్ ఈ అంశాన్ని సమావేశంలో తొలుత లేవనెత్తారు. వీరికి మద్దతుగా పలువురు ఎంపీలు గళం కలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా హాజరు కాకపోవడంతో రాజ్‌నాథ్ సింగ్ వారిని సముదాయించారు. అసలు మందిరాన్ని ఎప్పుడు నిర్మిస్తారు? నిర్మించే ఉద్దేశం పార్టీకి ఉందా? అంటూ పలువురు ఎంపీలు ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై పార్టీ చేపట్టాల్సిన చర్యలపై పార్టీకి ఒక దృక్పథం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. విపక్ష పార్టీలకు సరైన నేత లేక దశ దిశ లేకుండా పోతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఛరిష్మా కలిగిన మోదీ మన పార్టీకి ఉన్నారని, దానిని ఉపయోగించుకుని, మనం చేసిన అభివృద్ధిని వివరించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి నరేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాల సమావేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు.
పరస్పర అవగాహనతోనే సమస్యకు పరిష్కారం: గడ్కరీ
రామమందిర నిర్మాణం అన్న డిమాండ్ కులానికో, మతానికో సంబంధించిన అంశం కాదని, మందిరాన్ని ఎట్టిపరిస్థితిల్లో నిర్మించి తీరుతామని, అయితే అది పరస్పర అవగాహనతో చేపట్టాలన్నది తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.