జాతీయ వార్తలు

యుపిలో స్కూలు బస్సును ఢీకొన్న రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదోహి, జూలై 25: ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది పిల్లలు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. ఎలాంటి కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. రైలు వేగంగా వస్తున్నా దాన్ని ఎంతమాత్రం గమనించకుండా క్రాసింగ్‌కు దాటేందుకు స్కూలు బస్సు డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరప్రమాదం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలు బస్సులో ఉన్నారు. ఈ బస్సును వారణాసి-అలహాబాద్ ప్యాసింజర్ రైలు ఢీకొందని పోలీసులు తెలిపారు. దీని ప్రభావానికి బస్సు ఎగిరి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పడిందని తెలిపారు. రైలు వస్తున్న హెచ్చరికను అందించినప్పటికీ బస్సు డ్రైవర్ పట్టించుకోక పోవడమే ప్రమాదానికి కారణమంటూ ప్రాథమిక సమాచారం అందింది. ఈ దుర్ఘటన పట్ల రైల్వే మంత్రి సురేష్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్ మిత్ర ఉన్నాడని, రైలు వస్తోందంటూ బస్సు డ్రైవర్‌కు ఎర్ర జెండా ఊపడం ద్వారా సంకేతాలు అందించాడని, కాని హియర్ ఫోన్ పెట్టుకున్న బస్సు డ్రైవర్ హెచ్చరికను పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న స్కూలు పిల్లలు కూడా రైలు వస్తోందంటూ రైలు వస్తోందంటూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తున్నా వేగంగా క్రాసింగ్‌ను దాటేయాలనే ఉద్దేశంతో అతడు వారినీ పట్టించుకోలేదని వెల్లడించారు. గాయపడ్డ ఏడుగురు పిల్లలు, డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

చిత్రం.. రైలు ఢీకొనడంతో ఎగిరిపడ్డ పాఠశాల బస్సు