జాతీయ వార్తలు

ఇదే చివరి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు తోట నర్సింహం, మురళీమోహన్, గల్లా జయ్‌దేవ్, టీజీ వెంకటేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, పండుల రవీంద్రబాబు,శ్రీరాం మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనుకుంటే ఈ శీతాకాల సమావేశాలేలు బీజేపీకి చివరి అవకాశమని అన్నారు.
రామ్మోహన్ నాయుడు దీక్ష
విభజన హామీల అమలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిరాహార దీక్షకు దిగారు. మంగళవారం రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఉదయం నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకూ ఆయన నిరాహారదీక్షను కొనసాగించారు. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం మురళీమోహన్, అశోక్ గజపతిరాజు నిమ్మరసం ఇచ్చి నాయుడు దీక్షను విరమింపజేశారు.
ప్రతిరోజూ వినూత్న వేషధారణలతో నిరసన తెలుపుతున్న శివప్రసాద్ మంగళవారం జానపద గాయకుడు వంగపండు వేషధారణలో ఆందోళన వ్యక్తం చేశారు. జానపద గేయాలు పాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.