జాతీయ వార్తలు

బీజేపీ ఆదాయం అక్షరాల రూ. 1,027 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలను ఏడీఆర్ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,027 కోట్ల రూపాయలుగా బీజేపీ ప్రకటించింది. అందులో 76 శాతం అంటే 758.47 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) స్పష్టం చేసింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ 2017- 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ రిపోర్టు దాఖలు చేయలేదని ఏడీఆర్ వెల్లడించింది. మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ వాదీ పార్టీ ఆదాయం 51.7 కోట్లుకాగా 29 శాతం అంటే 14.78 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేసినట్టు పేర్కొంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వచ్చిన ఆదాయాన్ని అంతా ఖర్చుచేసింది. అంటే 8.15 కోట్ల రూపాయలు ఆదాయంలో పార్టీ 8.84 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు ఆడిల్ రిపోర్టులో పేర్కొంది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే బీజేపీ ఆదాయం తగ్గింది. 2016-17లో 1,033.27 కోట్లు ఉండగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,027.34 కోట్ల రూపాయలు ఆదాయం సంక్రమించింది. అలాగే ఆరు జాతీయ రాజకీయ పార్టీలు వివిధ మార్గాల ద్వారా 86.91 శాతం అంటే 1,041.80 కోట్ల రూపాయలు ఆర్జించాయి. ఇవన్నీ స్వచ్ఛందంగా విరాళాల రూపంలో వచ్చినవే. ఆరు రాజకీయ పార్టీలను పక్కన బెడితే ఒక్క బీజేపీకే ఎన్నికల బాండ్లు ద్వారా 210 కోట్లు సమకూరాయి. కాగా ఈ ఎన్నికల బాండ్లు పెద్ద డ్రామా అని సీపీఎం ధ్వజమెత్తింది. పన్ను ఎగవేతదారులకు ఎలక్ట్రోల్ బాండ్లు అన్నవి స్వరధామంగా పార్టీ సీనియర్ నేత సీతారామ్ ఏచూరి పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఒప్పందాల్లో జరుగుతున్న కుంభకోణాల వల్ల కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరుతుందని రాఫెల్ వివాదాన్ని ఆయన గుర్తుచేశారు. కార్పొరేట్లు, బడాపెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వ ప్రయోజనం చేస్తున్నందునే బాండ్ల రూపాయల ఆదాయం వచ్చిపడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీలు అందజేసిన ఐటీ రిటర్న్స్ ఆధారంగా ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వార్షిక ఆడిట్ నివేదిక అక్టోబర్ 30లోపుఅందజేస్తాయి. తృణమూల్, సీపీఎం,బీఎస్పీ గడువులోపే ఆడిట్ రిపోర్టు అందజేశాయి. సీపీఐ ఓ రోజు ఆలస్యంగా అందజేసింది. ఎన్‌సీపీ 20 రోజుల తరువాత, బీజేపీ 24 రోజుల తరువాత ఆడిట్ రిపోర్టు అందజేశాయి. అయితే డిసెంబర్ 17వతేదీ వరకూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి తన నివేదిక అందించలేదు. గడువుముగిసి 48 రోజులైనా కాంగ్రెస్ స్పందించలేదని ఏడీఆర్ వెల్లడించింది.