జాతీయ వార్తలు

కాంగ్రెస్ సభ్యత్వానికి సజ్జన్ కుమార్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన సజ్జన్ కుమార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. 1984లో జరిగిన మారణకాండలో దాదాపు 2700 మంది సిక్కులు దేశవ్యాప్తంగా మరణించిన విషయం తెలిసిందే. ‘్ఢల్లీ కోర్టు తనకు శిక్ష విధించినందున కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, దాన్ని వెంటనే ఆమోదించాలి’ అని రాహుల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనవల్ల పార్టీకి నష్టం కలగడానికి వీలులేదని 73 ఏళ్ల సజ్జన్ కుమార్ వెల్లడించారు. ఆయనకు ఇప్పటికీ ట్విట్టర్ ఖాతా లేకపోవడంతో లేఖను రాహుల్‌కు పంపించారని ఆయన ప్రతినిధి వివరించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దక్షిణ ఢిల్లీలో 1984 నవంబర్ 1-2 తేదీల్లో జరిగిన మారణకాండలో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షను విధించిన విషయం తెలిసిందే.

చిత్రం..ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో గల
ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రార్థనలు జరిపి నిష్క్రమిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్