జాతీయ వార్తలు

అధికారమిస్తే రైతులు రుణాలు మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 18: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని ఒడిశా బీజేపీ అధ్యక్షుడు బసంత్ పాండా మంగళవారం వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటు ఒడిశాలోనూ ఎన్నికలు జరగనున్నాయి. తమకు అధికారం అప్పగిస్తే రైతు రుణాలను మాఫీ చేయడంతోపాటు వడ్డీ లేని రుణాలను తిరిగి ఇస్తామని వాగ్దానం చేశారు. రైతుల పంటకు సరైన ధర చెల్లించని మండీలకు వ్యతిరేకంగా ‘మండీ చాలా అభియాన్’ పేరుతో బుధవారం నుంచి ఆందోళనకు శ్రీకారం చుడుతున్నామని, ఇది జనవరి 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4381 మండీలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు కష్టాలు తప్పడం లేదని పాండా ఆరోపించారు. రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 8న సచివాలయం వద్ద ఆందళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇలావుండగా ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని అధికార పార్టీ బీజేడీ జనవరి 8న పార్లమెంటు వద్ద ధర్నాకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అదే రోజున రాష్ట్రంలో ఆందోళనకు పిలుపివ్వడం గమనార్హం.