జాతీయ వార్తలు

జాతీయ మహిళా పార్టీ ఆవిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: సమాజంలో మహిళలకు రిజర్వేషన్లు, వారు ఎదుర్కొంటున్న వేధింపులు తదితర సమస్యలపై పోరాడటానికి కేవలం మహిళలు మాత్రమే ఉండే పార్టీని సామాజికవేత్త ఒకరు ప్రారంభించారు. నేషనల్ ఉమెన్స్ పార్టీ (ఎన్‌డబ్ల్యూపీ) పేరుతో కేవలం మహిళల కోసమే ఈ పార్టీని ప్రారంభించినట్టు శే్వతాశెట్టి ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో కేవలం మహిళల కోసమే ఏర్పాటు చేసిన పార్టీని స్ఫూర్తిగా తీసుకుని మహిళల భద్రత, సురక్షితమైన జీవనం, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించినట్టు ఆమె చెప్పారు. వాస్తవానికి ఈ పార్టీ ఏర్పాటుకు 2012లోనే పునాది వేశామని, లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది తమ ధ్యేమని అన్నారు. అయితే రిజర్వేషన్ల అంశం 2018 సంవత్సరం పూర్తవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదని, మహిళల హక్కులకు నిత్యం భంగం కలుగుతూనే ఉందని, వారిపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో మహిళల కోసం ఒక పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాజకీయ వ్యవస్థలో పురుషుల ఆధిక్యమే కొనసాగుతోందని, ఎవరో ఒకరిద్దరు మహిళలు ఉన్నా, రాజకీయాలన్నీ పురుషుల చుట్టూనే సాగుతున్నాయని, జనాభాలో సగం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని శే్వతాశెట్టి తెలిపారు.

చిత్రం..దేశంలో మహిళలతో కూడిన ఓ జాతీయ పార్టీ
ఆవిర్భవించింది. మంగళవారం ఈ పార్టీని ప్రారంభించిన లోగోను ఆవిష్కరిస్తున్న శే్వతాశెట్టి