జాతీయ వార్తలు

ఎవరూ ఊహించి ఉండరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సిక్కుల మారణకాండ కేసులో కాంగ్రెస్ నేతలకు జైలుశిక్ష పడుతుందని ఎవరూ ఊహించి ఉండరని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. 1984 నాటి కేసు విచారణలో జాప్యంపై ఆయన స్పందించారు.
‘కాంగ్రెస్ నాయకులకు శిక్ష పడుతుందని నాలుగేళ్ల క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. సిక్కుల ఊచకోత ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు’ అని మోదీ అన్నారు. సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాజకీయ లబ్ధి కోసం సజ్జన్ అల్లర్లను ప్రోత్సహించడం, హత్యలకు ప్రేరేపించడం జరిగిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈనెలాఖరులోగా లొంగిపోవాలన ఆయన కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు వెలువడిన మర్నాడే ప్రధాని మోదీ స్పందించారు. న్యాయస్థానాల తీర్పులన్నా కాంగ్రెస్ నేతలకు గౌరవం లేదని ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని సుప్రీం కోర్టును ఆశ్రయించారని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లడం బహుషా ఇదే మొదటి సారి అయింటుందని ఆయన విమర్శించారు. రాఫెల్ ఒప్పదం పారదర్శకంగా, నిజాయితీగా జరిగిందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్ల క్రితం వరకూ ఇలాంటివి జరుగుతాయని ఎవరూ ఊహించిఉండరని మోదీ ఎద్దేవా చేశారు. నాలుగున్నర ఏళ్ల క్రితం వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘మా ప్రభుత్వంపై ఇలాంటివి ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తాయని తెలుసు’అని ప్రధాని స్పష్టం చేశారు. అగస్తావెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ భారత్‌లో ఉండాల్సి వస్తుందని నాలుగేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? కాని అది జరిగింది అని మోదీ వ్యాఖ్యానించారు.
కార్టూన్లతో మనసుకు స్వస్థత
ముంబయి: కార్టూన్లు మనసును ఎట్టిపరిస్థితుల్లో గాయపరచవని, స్వస్థత చేకూర్చే శక్తి వాటికి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రముఖ కార్టూనిస్టు, కామన్‌మేన్ సృష్టికర్త ఆర్‌కె లక్ష్మణ్‌పై రచించిన ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా వచ్చిన కార్టూన్లను పరిశీలించడం ద్వారా సామాజిక, రాజకీయ చరిత్రపై ఏదైనా యూనివర్సిటీ కేసు స్టడీ నిర్వహించేలా చూడాలని కార్యక్రమానికి హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు సూచించారు. సోషల్ సైన్స్‌ను సమాజానికి సులభంగా విడమర్చి చెప్పడానికి లక్ష్మణ్ కార్టూన్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. లక్ష్మణ్ ఒక వ్యక్తి కాదని, తన గీతతో కోట్లాదిమంది హృదయాలను గెల్చుకున్న ధన్యజీవని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన కామన్‌మేన్ కార్టూన్లను డిజిటలైజ్ చేసి, ఏనిమేటెడ్ విధానంలో విడుదల చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల వారిని అభినందించారు. కార్టూనిస్టులు భగవంతునికి దగ్గర ప్రతినిధులని, అందుకే వారు సమాజంలోని పలువురు మనుషుల వైఖరి, హావభావాలను నిత్యం పరిశీలిస్తూ వాటిని కార్టూన్ల ద్వారా మనకు అందిస్తారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కార్టూన్‌లు తనపై చూపిన ప్రభావాన్ని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సి.విద్యాసాగర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ముంబైలో మంగళవారం జరిగిన రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రధానోపాన్యాసం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ