జాతీయ వార్తలు

ప్రధానితో మంత్రాలయం పీఠాధిపతి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 28: మంత్రాలయం పీఠాధిపతి శ్రీసుబు ధేంద్ర తీర్థులు గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని నివాసానికి వెళ్లిన పీఠాధిపతి ఆగస్టులో జరిగే శ్రీ రాఘవేంద్రస్వామి 345వ సప్తఆరాధనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ మేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను ప్రధానికి అందజేశారు. మఠంలో జరుగుతున్న శిలామంటపం తదితర అభివృద్ధి పనుల చిత్రాలను ప్రధానికి చూపించి వాటి గురించి వివరించారు.
2009 అక్టోబర్ 2న జరిగిన వరద బీభత్సం దృశ్యాలను చూపిస్తూ జరిగిన నష్టాన్ని ప్రధానికి వివరించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ప్రధాని అన్నారు. త్వరలో మంత్రాలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రధానికి స్వామివారి శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు, శాలువా, శ్రీ రాఘవేంద్రస్వామి చిత్రపటాన్ని అందజేసిన పీఠాధిపతి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్, ధార్వాడ ఎంపి ప్రహ్లాద జోషి, మఠం అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాఘవేంద్రస్వామి జ్ఞాపికను
అందజేస్తున్న మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు