జాతీయ వార్తలు

ఇంకా దొరకని ఎఎన్-32 ఆచూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన వైమానిక దళ విమానం ఎఎన్-32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ నెల 22న ఎఎన్-32 విమానం గల్లంతయింది. రక్షణ మంత్రి పారికర్ లోక్‌సభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఉపరితలం అలాగే సముద్ర గర్భంలోనూ విస్తృతంగా గాలింపు జరుగుతోందని ఆయన తెలిపారు. 13 నౌకలు, 4 కోస్ట్‌గార్డ్ నౌకలు, ఒక జలాంతర్గామి ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని పారికర్ చెప్పారు. అన్ని కోణాల్లోనూ గాలింపు జరుపుతున్నామన్న రక్షణ మంత్రి సముద్రంపై తేలియాడుతూ కనిపించిన చమురుతెట్టు వంటివాటిని నిపుణులు పరిశీలించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ ప్రాంతంలో తేలియాడుతూ 22 వస్తువులు కనిపించాయని అయితే అవి మిస్సయిన విమానానికి సంబంధించినవి కాదని నిర్ధారణ అయిందని మంత్రి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో బుధవారం కొన్ని పదార్థాలు తేలియాడుతూ కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఇండియన్ నావీకి చెందిన జలాంతర్గమి గురువారం నుంచి గాలింపులో పాల్గొంటోంది. కాగా బాధిత కుటుంబాల్లో మనోస్థయిర్యం నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పారికర్ స్పష్టం చేశారు. గాలింపు చర్యల వివరాలు ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు.