జాతీయ వార్తలు

ఏకాభిప్రాయానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న జిఎస్‌టి బిల్లుపై అధికార, విపక్షాల మధ్య సదవగాహన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పడానికి గురువారం రాజ్యసభ సాగిన తీరే నిదర్శనం. ఈ బిల్లుపై ఏకాభిప్రాయానికి గట్టి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం వచ్చే వారం దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ తాజా ధోరణిని విపక్షాలు హర్షించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ‘నిర్మాణాత్మకం... సానుకూలం’ అని వ్యాఖ్యానించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అలాగే ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యంలు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలతో అనేక దఫాలుగా ఈ బిల్లుపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆనంద్‌శర్మ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా పాల్గొన్నారు.