జాతీయ వార్తలు

పరువునష్టం దావాలు రాజకీయ అస్త్రాలు కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: పరువు నష్టం కేసులను ప్రభుత్వాలను విమర్శించే వారిపై రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో డిఎండికె అధ్యక్షుడు, తమిళనటుడు విజయకాంత్, ఆయన భార్యపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిలుపుదల చేసింది. ‘ప్రభుత్వం అవినీతిదని, పనికిరానిదని ఎవరైనా అంటే వారిపై పరువు నష్టం కేసు వేయడం సరికాదు’ అని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు, విమర్శలను సహించే గుణం ఉండాలి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను విమర్శించిన వారిపై ఆమె తరఫున రాష్ట్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుల జాబితాను రెండు వారాల్లోగా సమర్పించాలని కూడా బెంచ్ ఆదేశించింది. అసమ్మతిని అణచివేయడానికి పరువు నష్టానికి సంబంధించిన ఐపిసిలోని 499, 500 సెక్షన్లను ఉపయోగించుకోకూడదు. లెక్కలేనన్ని పరువు నష్టం దావాలతో జనాలను వేధించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవలసి వస్తుందని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. పరువు నష్టం దావాలకు సంబంధించిన నిబంధనలను దుర్వినియోగం చేయరాదని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాదికి బెంచ్ స్పష్టం చేసింది. 2015 నవంబర్ 6న విజయకాంత్ దంపతులు జయలలితపై తప్పుడు ఆరోపణలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారన్న ఆరోపణపై తిరుపూర్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడి కోర్టులో కేసు దాఖలు చేశారు.