జాతీయ వార్తలు

పప్పుల దిగుమతిపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో నిత్యావసర సరుకుల సరఫరాలను మెరుగుపర్చి ధరల పెరుగుదలకు కళ్లెం వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం విదేశాల నుంచి పప్పు్ధన్యాలాను దిగుమతి చేసుకునేందుకు మయన్మార్‌తో పాటు ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం వెల్లడించారు. దేశంలో పప్పు్ధన్యాల డిమాండ్‌కు, సరఫరాకు మధ్య దాదాపు 7.6 మిలియన్ టన్నుల అంతరం ఉందని, దీర్ఘకాలిక పద్ధతిలో పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకుని ఈ లోటును తగ్గించేందుకు మొజాంబిక్‌తో ఇప్పటికే అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, అలాగే మయన్మార్‌తో పాటు ఆఫ్రికా దేశాలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. దేశంలో ప్రధానంగా ప్రైవేటు వ్యాపారుల ద్వారా పప్పు్ధన్యాలను దిగుమతి చేయించి ఈ లోటును భర్తీ చేస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి ప్రభుత్వం ఈ దిగుమతులు జరిపించేందుకు ఎంఎంటిసిని రంగంలోకి దింపింది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంఎంటిసికి 56 వేల టన్నుల పప్పు్ధన్యాల దిగుమతి కాంట్రాక్టును ఇవ్వగా, ఇప్పటివరకూ 21,584 టన్నుల పప్పులు దిగుమతి చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మన దేశం 5.8 మిలియన్ టన్నుల పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకుంది. అయితే వర్షాభావం వలన గత రెండేళ్లలో దేశీయంగా 17 మిలియన్ టన్నుల పప్పు్ధన్యాల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య అంతరం భారీగా పెరిగింది.

చిత్రం.. పార్లమెంట్‌లో వివరాలు వెల్లడిస్తున్న
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్