జాతీయ వార్తలు

ఏపి ఏకపక్ష చర్యలను అడ్డుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా పాలార్ నదిపై ఎలాంటి డ్యామ్ పనులు చేపట్టకుండా నిరోధిస్తూ పర్మనెంట్ ఇంజంక్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్‌లోని పెరుపళ్లం, కంగనహళ్లి, సితావుర్, కంగ్‌కుంతి వద్ద పెంచిన చెక్‌డ్యామ్‌ల ఎత్తును తిరిగి ముందున్న స్థాయికి తగ్గించేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించినట్లు ఆమె వివరించారు. పాలార్, దాని ఉపనదుల సహజ నీటి ప్రవాహం తమిళనాడుకు వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టును కోరినట్లు జయలలిత పేర్కొన్నారు. పాలార్ నదిపై చెక్‌డ్యామ్‌ల ఎత్తు పెంచడాన్ని నిరసిస్తూ తాను ఈ నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాసినట్లు ఆమె గుర్తు చేశారు.