జాతీయ వార్తలు

ఆచూకీ లేని ‘జై’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 30: విదర్భ రీజియన్‌లోని వన్యప్రాణుల సరంక్షణ కేంద్రం నుంచి తప్పిపోయిన పులి ‘జై’ ఆచూకీకోసం దాదాపు వంద రోజుల నుంచీ గాలిస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ఉమ్రద్ కర్హాండ్ల కేంద్రంలో ఉండే ఈ పులికి అమర్చిన ఎలక్ట్రానిక్ ట్యాగ్ ఏప్రిల్ 18నుంచి పనిచేయడం లేదు. దాదాపు 400 గ్రామాల్లో పులి జాడకోసం వెతికారు. ఈ పులి విలువ మార్కెట్లో దాదాపు కోటి రూపాయలు ఉంటుందని, వేటగాళ్లు ఎవరైనా అపహరించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇలావుండగా పులి జాడను తెలిపినవారికి రూ.50వేలు బహుమతిగా ఇస్తామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది.