జాతీయ వార్తలు

మోదీ సర్కారు ప్రకటనల ఖర్చు 35 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రింట్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల కోసం చేసిన ఖర్చు 35 కోట్ల రూపాయాలు. ఆర్టీఐ చట్టం కింద అనిల్ గల్గానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్రం అందజేసింది. 11,236 వార్తా పత్రికల్లో అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చినట్లు డిఎవిపికి చెందిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి రూపావేది ఈ వివరాలను అందించారు.
‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’, ‘వికాస్ కీ రఫ్తార్’, ‘బద్ధకారోబార్’, ‘జన్ జన్ కా ఉధార్’ అనే ట్యాగులతో వివిధ జాతీయ పత్రికలతోపాటు, ప్రాంతీయ పత్రికలకు కూడా ప్రకటనలను విడుదల చేసినట్లు తెలిపారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్నపుడు ఏ మేరకు ఖర్చు చేసిందన్న ప్రశ్నకు ‘ఏమీ ఖర్చులేదు’ అనే సమాధానం వచ్చింది. దీన్నిబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిదని గల్గానీ అన్నారు.