జాతీయ వార్తలు

అలోక్ మళ్లీ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: సుప్రీం కోర్టు ఆదేశం మేరకు సీబీఐ డైరక్టర్‌గా పునర్నియమితులైన అలోక్ వర్మను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఉన్నతాధికారాల కమిటి గురువారం రాత్రి తొలగించి సంచలనం సృష్టించింది. నరేంద్ర మోదీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏ.కె.సిక్రిలతో కూడిన ఈ కమిటీ దీనికి ముందు కొన్ని గంటల పాటు విస్తృత చర్చలు జరిపింది. అలోక్ వర్మను మళ్లీ తొలగించాలనే నిర్ణయాన్ని ఖర్గే వ్యతిరేకించినట్లు తెలిసింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయమూర్తి సిక్రి మాత్రం అలోక్ వర్మ తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రెండు ఒకటి నిష్పత్తిలో అలోక్ వర్మను తొలగించాలని ఉన్నతాధికారాల కమిటీ నిర్ణయించటంతో మళ్లీ పదవి చేపట్టిన 25గంటలు తిరక్కుండానే వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. సీబీఐ డైరెక్టరుగా నెలాఖరు వరకూ కొనసాగాల్సి ఉన్న వర్మను అగ్నిమాపక దళం అధిపతిగా బదిలీ చేసినట్లు తెలిసింది. కాగా, కొత్త బాధ్యతలు చేపట్టకుండా వర్మ సెలవుపై వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. సుప్రీం నిర్ణయంతో బుధవారం సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన వర్గానికి చెందిన అధికారుల బదిలీలను రద్దు
చేయటంతో పాటు తనకు గిట్టని ఐదుగురు అధికారులను బదిలీ చేశారు. ఈనెల 31 తేదీ పదవీ విరమణ చేసేంత వరకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించినా ఆయన ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీనియర్ అధికారులను బదిలీ చేయటం ద్వారా ఆలోక్ వర్మ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అధికార పరిధిని సవాల్ చేశారని అంటున్నారు. ఆయన తీరు పట్ల ఆగ్రహం చెందిన నరేంద్ర మోదీ బుధవారం ఉన్నతాధికారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అలోక్‌వర్మ వ్యవహార శైలిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కాంగ్రెస్ నేత ఖర్గే మాత్రం వర్మకు మద్దతు పలికడంతో ఆయన్ని తొలగించే అంశంపై కమిటీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. అయితే గురువారం కూడా ప్రధాని మోదీ ఉన్నతాధికారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వర్మను సీబిఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించినందుకే అలోక్‌వర్మపై ప్రభుత్వం కత్తికట్టిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించటం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు అలోక్ వర్మ సీబీఐ డైరక్టర్‌గా పనర్ బాధ్యతలు చేపట్టగానే నరేంద్ర మోదీ అవినీతిపై దర్యాప్తుప్రారంభం అవుతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం తెలిసిందే. రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు జరిగితే తన బండారం బైటపడుతుందనే భయంతోనే నరంద్ర మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అలోక్ వర్మను మరోసారి తొలగించారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు వీరప్పమొయిలీ ఆరోపించారు.

చిత్రం.. అలోక్ వర్మ