జాతీయ వార్తలు

రాహుల్ స్ర్తిద్వేషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ‘రాహుల్ స్ర్తిద్వేషి. సీతారామన్‌ను ఉద్దేశించి చేసిన వాఖ్యలు అనైతికం’ అంటూ కమిషన్ తప్పుబట్టింది. జైపూర్‌లోని ఓ సభలో సీతారామన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రక్షణ మంత్రిని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను వివిధ పత్రికల్లో చూసిన మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ‘మహిళా మంత్రిని ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. అనైతికం కూడా. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానించేవే’ అని కమిషన్ మండిపడింది. స్ర్తిలపట్ల మీకున్న ద్వేషాన్ని వెళ్లగక్కారు అంటూ నోటీసులో పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కూడా తీవ్రంగా ఖండించారు.