జాతీయ వార్తలు

గుజరాత్ సిఎం ఆనందీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 1: మరో మూడు నెలల్లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తనను పార్టీ సంప్రదాయం ప్రకారం అన్ని రకాల బాధ్యతల నుంచి విముక్తం చేయాలంటూ గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ చేసిన అభ్యర్థనను బిజెపి నాయకత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేయడం, వెంటనే దానిని ఆమోదించడం వెంటనే జరిగిపోయాయి. 75 సంవత్సరాలు దాటిన నాయకులెవరూ పార్టీ పదవులను నిర్వహించకూడదన్న సంప్రదాయాన్ని గౌరవిస్తూనే తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆనందీ బెన్ తెలిపారు. తాజా కథనాలను బట్టి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రూపానీకి ఆనందీ బెన్ తన రాజీనామాను పంపినట్టుగా స్పష్టమవుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన అనంతరం ఆయనకు విధేయురాలిగా భావించిన ఆనందీ బెన్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా గుజరాత్ పగ్గాలు చేపట్టారు. ‘నవంబర్‌లో నాకు 75 సంవత్సరాలు నిండుతాయి. అయితే కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే వ్యక్తికి మరింత సమయాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. దాన్ని ఆమోంచాలని కోరుతున్నాను’ అని ఆనందీ బెన్ గుజరాతీలో రాసిన లేఖలో స్పష్టం చేశారు. త్వరలోనే ద్వైవార్షికంగా రాష్ట్రం నిర్వహించే ఉజ్జ్వల గుజరాత్ కార్యక్రమం జరగబోతోందని, అలాగే అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది జరుగుతాయని పేర్కొన్న ఆమె, వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే కొత్త ముఖ్యమంత్రికి తగిన వ్యవధి అవసరమని ఆమె తన రాజీనామాలో స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామంపై విపక్షాలు అధికార బిజెపిపై విరుచుకుపడుతున్నాయి.