జాతీయ వార్తలు

ముగ్గురు ప్రముఖులపై దేశద్రోహం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటి: అస్సాం పౌరసత్వ(సవరణ) బిల్లు-2016కు లోక్‌సభ ఆమోదం తెలపడమే తరువాయి అమల్లోకి వచ్చేసింది. రెండ్రోజుల క్రితమే వివాదాస్పద బిల్లుకు సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. బిల్లును వ్యతిరేకిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, అస్సామీ సాహితీవేత్త హిరేన్ గొహైన్, ఆర్‌టీఐ కార్యకర్త, అఖిల్ గొగోయ్, సీనియర్ పాత్రికేయుడు మణ్‌జిత్ మహంతపై దేశద్రోహం కేసు నమోదైంది. ఓ వైపుబిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతుండగా ముగ్గురు ప్రముఖులపై దేశ ద్రోహం కేసులు నమోదుకావడం గమనార్హం. రాజధాని గువహటిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకే ముగ్గురు ప్రముఖులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఐపీసీ 124(ఏ), 120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు గువహటి పోలీసు కమిషనర్ దీపక్ కుమార్ గురువారం వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు హిరేన్ గొహైన్, ఆర్‌టీఐ కార్యకర్త అఖిల్ గొగోయ్, సీనియర్ జర్నలిస్టు మహంతపై ఐపీసీ 121,123 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కుమార్ చెబుతూ ‘ముగ్గురిపై విచారణ జరుగుతోంది’అని స్పష్టం చేశారు. నాగరిక్ సమాజ్ సమావేశంలో జనవరి 7న వారు ఏమి మాట్లాడిందీ తాను దర్యాప్తు చేస్తున్నానని, మిగతా వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని కమిషనర్ చెప్పారు. గొహైన్, అఖిల్, మహంత నాగరిక్ సమాజ్‌తో ఓ పౌర సమితిని ఏర్పాటు చేసి బిల్లుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తునట్టు ఆయన పేర్కొన్నారు. గౌహతి యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గొహైన్ ప్రసిద్ధి అస్సామీ రచయిత, సాహితీ వేత్త. తనపై దేన్ని ఆధారం చేసుకుని దేశ ద్రోహం కేసు పెడతారని పోలీసులను నిలదీశారు. స్వంతత్ర అస్సాం అన్నందుకే తనపై కేసు నమోదు చేశారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొగోయ్ ప్రముఖ ఆర్‌టీఐ కార్యకర్త. అలాగే క్రిషక్ ముక్తి సంగ్రాం సమితి(కేఎంఎస్‌ఎస్) సంస్థ అధినేత. దేశ ద్రోహం అభియోగం ఎదుర్కొంటున్న మహంత అస్సామీ ప్రముఖ పత్రికలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. మంచి కాలమిస్ట్. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేంగా నడుస్తున్న ఆందోళనలకు కేఎంఎస్‌ఎస్ నాయకత్వం వహిస్తోంది. 70 సంఘాలకు కేఎంఎస్‌ఎస్ నేతృత్వం వహిస్తోంది. వివిధ సందర్భాల్లో మూడు సార్లు బిల్లుపై తాను మాట్లాడానని ఆర్‌టీఐ కార్యకర్త గొగోయ్ తెలిపారు.