జాతీయ వార్తలు

సొహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షా నిర్దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: సొహ్రాబుద్దీన్ షేక్ బూటకపుఎన్‌కౌంటర్ కేసులో బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టులు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీం కోర్టు సోమవారం ధ్రువీకరించింది. ఈ కేసును తిరగదోడాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తులు ఎస్‌ఎ బాబ్దే, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి స్పష్టం చేసింది. సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ షేక్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి సిద్ధ పడిన నేపథ్యంలో ఈ కేసుతో మీకున్న సంబంధమేమిటి?దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని పిటిషనర్ హర్‌షమందేర్‌ను న్యాయమూర్తులు ప్రశ్నించారు. నిజంగా బాధితుడు ఈ కేసును దాఖలు చేస్తే దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోగలమని, కానీ దీనితో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి పిటిషన్ దాఖలు చేస్తే దాని అర్థం మరోలా ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం వల్లే తాను పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని మందేర్ కోర్టుకు వివరించారు. మందేర్ తరపున ఈ కేసును వాదించిన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ఆయన వాదనను బలపరిచేందుకు ప్రయత్నించారు. పలు అవినీతి అంశాల్ని ప్రస్తావిస్తూ ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత మందేర్‌కు ఉందని చెప్పారు. ఎలాంటి బలమైన కారణం లేకుండానే బాధితుడి సోదరుడు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారని.. ఎవరూ చట్టానికి అతీతులు కారన్న భావన ప్రజల్లో కలగాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. దానికి తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తులు ‘మేము ఎవర్నీ చట్టానికి అతీతులుగా భావించడం లేదు’అని ఉద్ఘాటించారు.