జాతీయ వార్తలు

మీ దేశానిది ఉగ్ర నైజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: భారత్‌తో సత్సంబంధాలు పెట్టుకోవాలని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఉద్దేశ్యం పాకిస్తాన్‌కు లేదని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిథి రవీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. పాక్‌తో మాట్లాడాలనే ఉత్సాహం ఢిల్లీకి లేదంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను కేంద్రం తిప్పిగొట్టారు. పాకిస్తాన్‌కు ఉగ్రవాదంపై, చర్చలపై సీరియస్‌నెస్ లేదన్నారు. ఒక వైపు తన భూభాగంలో తిష్టవేసిన ఉగ్రవాద తండాలకు అవసరమైన సహాయాన్ని సమకూర్చుతూ, బయటకు మాత్రం ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారన్నారు.
నిజంగా పాకిస్తాన్‌కు చర్చలంటే చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులను పాక్ గడ్డపై నుంచి తరిమిగొట్టాలన్నారు. తాము చర్చలకు సిద్ధమని పదే పదే ప్రకటనలు చేసినా ఢిల్లీ స్పందించడం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. ఈ ప్రకటనలను ఇమ్రాన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రకటనల్లో నిజాయితీ లేదన్నారు. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహాయం చేస్తూ, ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో చర్చలెందుకని విదేశాంగ మంత్రిత్వశాఖ అన్నారు. ఒక వైపు చర్చలంటారు, మరోవైపు పాక్ మంత్రులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల సమావేశాలకు హాజరవుతారు. ఈ పరిస్థితుల్లో పాక్‌ను ఎందుకు నమ్మాలన్నారు. ముంబయి, పఠాన్‌కోట ల్లో విధ్వంసం సృష్టించిన సూత్రధారులు పాక్‌లో నక్కి ఉన్నారని, వారి భరతం పడితే కొంతలో కొంత నమ్మవచ్చన్నారు. ఈ దుష్టశక్తులు పాకిస్తాన్‌లో నిర్లజ్జగా తిరుగుతుంటే, పాకిస్తాన్‌తో చర్చించేందుకు ఏముందన్నారు. పాకిస్తాన్ దుర్బుద్ధిలో మార్పులేదన్నారు. తన దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుండా పాకిస్తాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తిలేదని కేంద్రం కరాఖండిగా చెప్పింది. సమానత్వం, ఆదర్శం, ప్రజాస్వామ్యం, హక్కుల గురిం చి మాట్లాడే హక్కు పాక్‌కు లేదన్నారు. పాకిస్తాన్ సుద్దులు చెప్పడం మాని తన దేశాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. పాక్‌లో అస్థిరత్వం ఉందని, ఉగ్రవాద మూకలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయని, మైనార్టీలకు స్వేచ్ఛలేదని భారత్ దుమ్మెత్తిపోసింది. పాకిస్తాన్‌లో జరుగుతున్న రాక్షసకృత్యాల గురించి ప్రపంచానికి తెలుసని కేంద్రం పేర్కొంది.