జాతీయ వార్తలు

‘ముందస్తు’ తాయిలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన వస్తుల సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో మార్పుతో అదనంగా 20 లక్షల చిన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపుదక్కనుంది. కాగా ఎన్నికల ముందస్తు తాయిలాలుగా ఆరు అదనపుప్రయాజనాలు మోదీ ప్రభుత్వం కల్పించింది. గడచిన డిసెంబర్ 28న ఉల్లి ఎగుమతుల రాయితీలను ద్విగుణీకృతం చేసిన కేంద్ర సర్కారు మొత్తం 10 శాతం రాయితీల ద్వారా రైతుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది. ఇలా మొత్తం ఆరు తాయిలాలతో అటు రైతులు, ఇటు వ్యాపారుల దృష్టిని ఆకట్టుకునే చర్యలు చేపట్టింది. ఇటీవలి ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బతోబాటు, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త తాయిలాలకు తెరలేపింది. ఈ కారణంగా ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న మనదేశ ఆర్థిక రంగానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ధ కాలానికన్నా అధిక స్థాయి ఆర్థిక లోటుకు, దేశ స్థూల వృద్ధి రేటులో 3.3 శాతం తరుగుదలకు దారితీయవచ్చని అంటున్నారు. కానీ దాదాపుగా మేలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం మరిన్ని హామీలను, రాయితీలకు ప్రకటించడం జరుగుతోంది. ‘జనం అభివృద్ధినీ, ఆర్థిక వృద్ధినీ కోరుకుంటున్నారు’ అని కేంద్ర న్యాయ, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ డివిండెండ్‌తో లోటు పూడ్చవచ్చు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యంతర డివిడెండ్‌గా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వచ్చే మార్చి నాటికి ప్రకటించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ అంచనా వేసింది. ఈ మొత్తంతో ఆర్థిక లోటును భర్తీచేసే వీలుందని, అయితే ఎన్నికల తాయిలాల కారణంగా ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
కొత్త రాష్ట్ర ప్రభుత్వాలదీ అదేతీరు
ఇటీవల రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు సైతం జనాకర్షక పథకాలతో ఆర్థిక వ్యవస్థకు గండికొట్టే చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా రైతు రుణాల మాఫీపై హామీలు నిలుపుకునేందుకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాకర్షక చర్యల విషయానికి వస్తే వరుసగా కింది విధంగా ఉన్నాయి. ఈనెల 10న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధానంలో మార్పును ప్రకటించడం ద్వారా 20 లక్షల చిన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపునిచ్చింది. రూ.40 లక్షల వరకు వార్షిక అమ్మకాలతో నడిచే వ్యాపారాలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.20 లక్షల వరకే ఉంది. వచ్చే ఏప్రిల్ మాసం నుంచి సవరణ అమలులోకి వస్తుంది.
రైతులకు బాసటగా..
రైతులను ఇబ్బందుల నుంచి గటెక్కించేందుకు మూడు ఐచ్చికాలతో కూడిన సహాయ ప్యాకేజీని మోదీ ప్రభుత్వం రూపొందించింది. ప్రత్యేకించి సుమారు 3లక్షల కోట్ల విలువైన పంటలకు మద్దతు ధర కరవైన సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకు నేరుగా నగదును అందించి ఆదుకునే సాధ్యాసాధ్యాల పరిశీలన, అలాగే తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం, వ్యవసాయ రుణాలను రద్దు చేయడం వంటివి కేంద్రం చేపట్టింది. కాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు, ఉల్లి రైతుకు ఎగుమతులపై ఇచ్చే రాయితీలను ద్విగుణీకృతం చేయడం, ఈ కామర్స్ కంపెనీలపై నిబంధనలను కఠినతరం చేయడం, 20 గృహోపకరణాలపై పన్ను రాయితీ కల్పించడం వంటి చర్యలు కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే.