జాతీయ వార్తలు

స్వదేశానికి తీసుకొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన సుమారు పది వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం పార్లమెంటుకు చెప్పారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు సౌదీ అరేబియాకు వెళ్తున్నారని ఆమె పార్లమెంటు ఉభయసభల్లో చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆకలితో అలమటిస్తున్న సుమారు పదివేల మంది పరిస్థితిపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి ఈ ప్రకటన చేశారు. సౌదీలోని ఇండియన్ ఎంబసీ అయిదు సహాయక శిబిరాలు నిర్వహిస్తూ, వాటి ద్వారా బాధితులకు పది రోజులకు సరిపడే ఆహార సామగ్రిని అందజేయడం జరిగిందని, సోమవారం తెల్లవారు జాము వరకు కూడా తనకు గంట గంటకు దీనికి సంబంధించిన సమాచారం వచ్చిందని ఆమె తన ప్రకటనలో వివరించారు. ‘ఏ ఒక్క మన కార్మికుడూ ఇక ఆకలితో అలమటించడు. ఇది నేను పార్లమెంటు ద్వారా దేశానికి ఇస్తున్న హామీ. మేము వారిని తిరిగి భారత్‌కు తీసుకువస్తాం’ అని స్వరాజ్ పేర్కొన్నారు. వారిని వీలయినంత త్వరగా స్వదేశానికి తీసుకు రావడానికి భారత ప్రభుత్వం సౌదీ అరేబియా విదేశాంగ, కార్మిక శాఖ కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆమె చెప్పారు. యాజమాన్యాల నిరభ్యంతర ధ్రువపత్రాలు లేకుండా అక్కడి భారతీయులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ వీసాపై తీసుకురావడం సౌదీ చట్టాల ప్రకారం వీలుకాదని ఆమె వివరించారు. అయితే యాజమాన్యాలు మాత్రం తమ ఫ్యాక్టరీలను మూసివేసి దేశం వదలి వెళ్లిపోయాయని, దీంతో వాటిలో పనిచేస్తున్న కార్మికులు వేతనాలు లేకుండా అక్కడ చిక్కుకుపోయారని ఆమె తెలిపారు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు దేశం వదలివెళ్లిపోయినందున కార్మికులకు ఎగ్జిట్ వీసాలు ఇవ్వాలని భారత్.. సౌదీ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే సంబంధిత ఫ్యాక్టరీల ఖాతాలను పరిష్కరించే సమయంలో నెలల తరబడిగా కార్మికులకు రావలసి ఉన్న వేతన బకాయిలను తొలుత ఇవ్వాలని కూడా కోరింది. మంత్రి ప్రకటనపై లోక్‌సభలో కొంత మంది ప్రతిపక్ష సభ్యులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తగా స్పీకర్ సుమిత్రా మహాజన్ వాటికి అనుమతించలేదు.