జాతీయ వార్తలు

ఏపీకి హోదా ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జనవరి 11: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల దుబాయి పర్యటనకు వచ్చిన రాహుల్ శుక్రవారం భారతీయ కార్మికులతో భేటీ అయ్యారు. దుబాయిలోని లేబర్ కాలనీలో కార్మికులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు.‘కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తాం’అని ఆయన వెల్లడించారు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. ‘బతుకుదెరువుకోసం దుబాయి వచ్చిన మీరు భారత్ అభివృద్ధికి తోడ్పాటును అందించడం సంతోషదాయకం. ఈవిషయంలో మీమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’అని కాంగ్రె స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. యూఏఈ అభివృద్ధిలోనూ భారతీయ కార్మికుల కృషిని ఆయన ప్రశంసించారు. ‘యూఏఈలో ఇక్కడ ఆకాశ హార్మ్యాలు, పెద్దపెద్ద విమానాశ్రయాలు, మెట్రో నిర్మాణాలు మీ కృషితోనే జరిగాయి. మీ చెమట, రక్తం, కాలాన్ని ధారబోసి
దుబాయి నగరాన్ని తీర్చిదిద్దారు’అని రాహుల్ అన్నారు. ‘మీ సేవలు లేకుండా ఇలాంటి నిర్మాణాలు అసాధ్యం. ఇంత అభివృద్ధి వెనకు మీరుండడం భారత్‌కు గర్వకారణం’అని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తాం’అని కార్మికులకు హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో కేంద్రం ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేయలేదని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కాంగ్రెస్ అధినేతకు దుబాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. యూఏఈ అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ కార్మికులను రాహుల్ ప్రశంసలతో ముంచెత్తారు. గల్ఫ్‌లో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ కార్మికులను తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ‘నా అభిప్రాయాలు చెప్పడానికి దుబాయికి రాలేదు. మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని వచ్చాను’అని రాహుల్ స్పష్టం చేశారు. జబేల్ ఆలీ లేబర్ కాలనీలో భారతీయ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతుతూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంపై వ్యంగ్యోక్తులు విసిరారు. ప్రజల సమస్యలు వినడానికి కాకుండా ఆయన చెప్పింది వినాలన్న ధోరణియే ఎక్కువని ఆయన విమర్శించారు. కేరళ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా కాంగ్రెస్ అధ్యక్షుని వెంట ఉన్నారు. తొలుత వ్యాపారవేత్తలతో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్ రెండ్రోజుల పర్యటనలో యూఏఈ మంత్రులు, ఉన్నతాధికారులను కలుసుకుంటారు. దుబాయి, అబుదాబీలో భారతీయ కార్మికులతో సమావేశమవుతారు.