జాతీయ వార్తలు

ఈబీసీ కోటాకు రాష్ట్రపతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి రాజముద్ర వేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో రాజ్యాంగ బద్ధత లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రమంత్రి మండలి ఈ నెల 7న సమావేశమై ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అనంతరం ఈ బిల్లును 8వ తేదీన లోక్‌సభ, 9న రాజ్యసభ ఆమోదించాయ. రాష్ట్రపతి ఆమోదం పొందడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చినట్లయంది.