జాతీయ వార్తలు

విఫల ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే మహాకూటమి ఓ విఫల ప్రయోగంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు బలహీన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి, బంధుప్రీతిని పెంచి పోషించే ప్రభుత్వం ఉండాలన్నదే ప్రతిపక్షాల కోరిక అంటూ మోదీ నిప్పులు చెరిగారు. అలాంటి అవలక్షణాలకు బీజేపీ పూర్తి వ్యతిరేకం, దూరం అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే బీజేపీ అభిమతంగా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఆ పార్టీకి ఓ స్పష్టమైన వైఖరే లేదని ప్రధాని ధ్వజమెత్తారు. అయోధ్య వివాదాస్పద సమస్యకు పరిష్కారం చెప్పలేరుగాని, న్యాయవాదుల ద్వారా సమస్యను జఠిలం చేయడం, అడ్డంకులు సృష్టించడం చేయగలరని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శించడం మళ్లీ అదే పార్టీతో ఫ్రంట్ కట్టడం ప్రతిపక్షాలకు ఓ అలవాటుగా మారిపోయిందని ప్రధాని విమర్శించారు. అది వారి సంస్కృతి అని
మోదీ అన్నారు. ‘మేం పటిష్టవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అప్పుడే అవినీతిని రూపుమామవచ్చని భావిస్తాం. ప్రతిపక్షాలకు ఈ రెండూ లేవు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాకూటమి అన్నది ఓ విఫల ప్రయోగంగా ఆయన పేర్కొన్నారు. మహాకూటమి పేరుతో బలహీన ప్రభుత్వం కావాలన్నది ప్రతిపక్షాల కోరిక అంటూ మోదీ ధ్వజమెత్తారు. ‘వాళ్ల దుకాణాలు మూడపడతాయన్న భయంతోనే బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు’ అని విపక్షాలపై మండిపడ్డారు. యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమి ప్రకటన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘అవినీతిని పారదోలడానికి బలమైన ప్రభుత్వం ఉండాలన్నది మా అభిప్రాయం. బలహీన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగుతాయని ప్రతిపక్షాల ఎత్తుగడ’ అని ఆయన అన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ తమ లక్ష్యమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి అవినీతి, అక్రమాలకు ఎక్కడ బయటపడిపోతాయోనన్న భయంతోనే సీబీఐని వద్దంటున్నాయని మోదీ అన్నారు. ‘యూపీఏ హయాంలో జాతీయ దర్యాప్తు సంస్థలను ఎంతగా దుర్వినియోగం చేసిందీ తెలుసు. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐని ఉసిగొల్పారు. అలాగని భయపడిపోయి నేను సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకోలేదు’ అని మోదీ స్పష్టం చేశారు. ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని, దేశంలోనే ఇది తొలిసారని ఆయన పేర్కొన్నారు. అవినీతి లేకుండా పాలన సాగుతోందని ఆయన వెల్లడించారు. ‘2022 నాటికి రైతన్నల ఆదాయం రెట్టింపుచేయడం కోసం మా ప్రభుత్వం రేయింబవళ్లూ పనిచేస్తోంది’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. గత ప్రభుత్వాలు రైతులను ఓటర్లుగానే చూశాయని ఆయన విమర్శించారు.
నవ భారత నిర్మాణం సాధ్యం: మోదీ
ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించడంతో నవ భారత నిర్మాణం సాధన సులువవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇతర వర్గాల హక్కులను కాలరాయకుండా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించామని అన్నారు. శనివారం ఇక్కడ బీజేపీ కార్యకర్తల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా అవినీతి మచ్చలేకుండా ఐదేళ్ల పాలన అందించామన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు సందర్భంగా వేదికపై సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి చేయూతనిస్తున్న చిత్రం..ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్