జాతీయ వార్తలు

త్రిష్న గ్యాస్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, జనవరి 12: రాష్ట్రంలోని గోమతి జిల్లాలో బెలోనియా సబ్‌డివిజన్‌లో చేపట్టనున్న ఓఎన్‌జీసీ త్రిష్న గ్యాస్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. గ్యాస్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు జాతీయ వన్యప్రాణి అభయారణ్యం (నేషనల్ వైల్డ్‌లైఫ్ సాంక్చ్యువరీ)కి చెందిన బోర్డు అనుమతి ఇచ్చిందని రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. త్రిపుర అస్సెట్‌కు చెందిన ఓఎన్‌జీసీ ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే ఈ గ్యాస్ ప్రాజెక్టు పనులకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇక పనులు ప్రారంభం కానున్నాయని ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
త్రిష్న వన్యప్రాణి అభయారణ్యం (వైల్డ్‌లైఫ్ సాంక్చ్యువరీ)లో 10-12 గ్యాస్ బేరింగ్ బావులు ఉన్నట్టు తాము చాలాకాలం కిందటే కనుగొన్నామని ఆయన తెలిపారు. అయితే, ఈ వన్యప్రాణి అభయారణ్యం (వైల్డ్‌లైఫ్ సాంక్చ్యువరీ) జోన్‌లో ఈ గ్యాస్ నిక్షేపాలు ఉండడంతో వాటిని తవ్వేందుకు జాతీయ వన్యప్రాణి అభయారణ్యం బోర్డు బోర్డు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ఇపుడు ఈ భారీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రావడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఓఎన్‌జీసీ త్రిపుర అస్సెట్ మేనేజర్ గౌతమ్ కుమార్ సింఘా శనివారం ఇక్కడ మీడియా ప్రతినిధులకు తెలిపారు.
ఈ గ్యాస్ ప్రాజెక్టు నిర్మాణానికి గత ఏడాది సెప్టెంబర్ 17న రాష్ట్ర వన్యప్రాణి అభయారణ్యం బోర్డు అనుమతి ఇచ్చిందని, ఈ విషయాన్ని జాతీయ వన్యప్రాణి అభయారణ్యం బోర్డుకు పంపామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ గ్యాస్‌లైన్‌కు సంబంధించి ఓఎన్‌జీసీ పైప్‌లైన్ పనులు ప్రారంభించిందని, ఈ పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు. త్రిష్న వన్యప్రాణి అభయారణ్యం ప్రాజెక్టు నుంచి సిపాహిజాలా జిల్లాలోని సోనామురా సబ్‌డివిజన్‌లో గల మోనార్చక్ నార్తర్న్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఈపీసీఓ)కు చెందిన 100 మెగావాట్ల గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్టుకు గ్యాస్‌ను సరఫరా చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు.