జాతీయ వార్తలు

మా ఆదేశాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 1:కరువు పీడిత రాష్ట్రాల్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులకు ఏ విధంగానూ రుణాలు అందడం లేదన్న విషయం వాస్తవమేనని తేలిపోయిందని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ‘వర్షాలు మొదలయ్యాయి. మా ఆదేశాలు అమలు కానప్పుడు రోజువారీగా విచారణ జరపడం, ఆదేశాలు జారీ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి?’అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అసలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయో లేదో నిర్థారించుకోవాలంటూ న్యాయమూర్తులు ఎమ్‌బి లోకూర్, ఎన్‌వి రమణలతో కూడిన బెంచి కేంద్రాన్ని ఆదేశించింది. కరవు పీడిత ప్రాంతాల్లోని రైతుల పరిస్థితులను తెలుసుకుని సెప్టెంబర్ 14లోగా తమకు నివేదిక ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహాకు విజ్ఞప్తి చేసింది. గుజరాత్ సహా మొత్తం 12 జిల్లాల్లోని కరవుపీడిత రైతుల స్థితిగతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు రైతుల కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, వారికి ఇచ్చిన రుణాల చెల్లింపు గడువును సడలించే ప్రయత్నాలేవీ జరగలేదని పిటిషనర్ యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థల విషయంలోనే రుణాల చెల్లింపులకు సంబంధించి వెసులుబాటు కల్పిస్తున్నారని పేర్కొన్న ఆయన ‘ఆదాయం లేక వాయిదాలు చెల్లించలేని రైతులకు నోటీసులు ఇస్తున్నారు. డిఫాల్టర్లుగా పేర్కొంటూ వాళ్ల ఫొటోలనూ పత్రికల్లో ముద్రిస్తున్నారు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాదన వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ, ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అసలు ఏమీ జరుగడం లేదని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని పేర్కొన్నారు.