జాతీయ వార్తలు

ఆరోపణలు అర్థరహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 12: భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైనట్టు సమాజ్‌వాది పార్టీ చీఫ్ మాయావతి చేసిన ఆరోపణలు అర్ధరహితమని ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ (పీఎస్‌పీఎల్) అధినేత శివ్‌పాల్ యాదవ్ ఖండించాడు. ఈమేరకు పార్టీ తరఫున అధికార ప్రతినిధి సీపీ రాయ్ శనివారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ అధినేత శివ్‌పాల్ యాదవ్‌పై బీఎస్పీ అధినేత్రి చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని టికెట్లను అమ్ముకోవడంలో అవినీతికి ఎవరు పాల్పడ్డారో అందరికీ తెలిసిందేనని పీఎస్‌పీఎల్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించాడు. బీజేపీకి అమ్ముడుపోయిన శివ్‌పాల్ యాదవ్ పార్టీకి ఓటు వేసి సమయాన్ని వృధా చేసుకోవద్దని మాయావతి ఇటీవల పార్టీ కేడర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. బీజేపీ వాళ్లు ఇస్తున్న డబ్బుతో పార్టీని నడుపుతున్న శివ్‌పాల్ యాదవ్ పార్టీ మట్టికొట్టుకుపోవడం ఖాయమని మాయావతి చేసిన ఆరోపణలను పీఎస్‌పీఎల్ పార్టీ తరఫున సీపీ రాయ్ తీవ్రంగా ఖండించాడు.