జాతీయ వార్తలు

వ్యవసాయ రంగం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: దేశ జనాభాలో దాదాపు 60 శాతం ప్రజల మనుగడకు ఎంతో దోహదపడుతున్న వ్యవసాయ రంగాన్ని దీర్ఘకాలికంగా ఉపయోగపడే మార్పులతో పరిపుష్టం చేయడం వల్ల మరింత బలోపేతం చేయవచ్చునని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఇండస్ట్రీ లాబీ సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు ఆహార భద్రతను అందజేస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన, స్థితిస్థాపకమైన ఆదాయ వనరుగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా కోళ్ల పరిశ్రమ, ఉద్యానవనం, మత్స్య శాఖ వంటి అనుబంధ విభాగాల్లో రైతులను మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం ప్రజలకు వివిధ రూపాల్లో ఆహార పదార్థాలను అందజేస్తున్న రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక అని ప్రతిఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. వ్యవసాయ సంక్షోభం, పంటలకు పెట్టుబడి ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం, పంటల ఉత్పత్తులకు తగిన ధరలు లేకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్న వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉప రాష్టప్రతి విచారం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘ్ఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో వందలాది రైతులు పంటల కోసం భారీగా పెట్టుబడి పెట్టినా అందుకు అనుగుణంగా సరైన మద్దతు ధర లేకపోవడం, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, హార్టికల్చర్ విభాగాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయకంగా రైతులను మరింత ప్రోత్సహించడం వల్ల ఆర్థికపరంగా, ఆరోగ్యవంతమైన దేశాన్ని తయారు చేయవచ్చునని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయంతోపాటు ఆధునిక పరికరాల వినియోగం, నీటి వనరుల సద్వినియోగంపై రైతులు మరింత ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన సూచించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించడం, పరిశోధన, అభివృద్ధిపై మరింత ఎక్కువ పెట్టుబడితోపాటు అందుకు తగిన సమయాన్ని కూడా కేటాయించాలని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.