జాతీయ వార్తలు

హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల పొత్తును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అఖిలేష్, మాయావతి కూటమిగా ఏర్పడడం హర్షదాయకమని శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. కూటమిని స్వాగతిస్తూ తృణమూల్ అధినేత్రి ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏడాది నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ ప్రతిపక్షాలన్నిటీని ఓ వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయడానికి కలిసి రావాలని ఆమె పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. దేశంలోనే పెద్ద రాష్ట్రం, ఎక్కువ ఎంపీ సీట్లున్న యూపీలో ఎస్పీ,బీస్పీ ఓ కూటమిగా ఏర్పడాలని మమత ఇంతకు ముందే విజ్ఞప్తి చేశారు. ఉత్తరభారతంలో యూపీనే కీలకం అవుతుందని పలుసార్లు ఆమె స్పష్టం చేశారు. 80 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నాలుగు తప్ప మిగతాసీట్లలో కలిసి పోటీ చేయాలని అఖిలేష్, మాయావతి నిర్ణయించడం అభినందనీయమని సీఎం మమత అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఇది మార్గదర్శకం అవుతుందని ఆమె ట్వీట్ చేశారు.