జాతీయ వార్తలు

అపవిత్ర కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: యూపీలో ఎస్పీ, బీఎస్పీ మహాకూటమిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ కూటమి అవినీతి, అపవిత్ర, అవకాశవాదంతో కూడుకున్నదని శనివారం ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసిపోటీకి అఖిలేష్, మాయావతి కూటమిగా ఏర్పడ్డారు. ఇరువురునేతలు సంయుక్త ప్రకటన చేసిన కొద్ది సేపటికే యూపీ సీఎం తీవ్రంగా స్పందించారు. రాష్ట్భ్రావృద్ధి, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎస్పీ, బీఎస్పీ జత కట్టాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాలను యోగి ఎండగట్టారు. కులం, ప్రాంతం, మతం పేరుతో దేశాన్ని చిన్నాభిన్నం చేశారని ఆయన ఆరోపించారు. కుటుంబం బాగోగుల కోసమే కాంగ్రెస్ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని యూపీ సీఎం స్పష్టం చేశారు. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలనతో మోదీ ప్రభుత్వం దూసుకుపోతోందని ఆయన అన్నారు.