జాతీయ వార్తలు

ఉనికి కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ఉనికి కోసమే ఎస్పీ,బీఎస్పీ కూటమి ఎత్తుగడతో ముందుకొస్తున్నాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. దేశం లేదా యూపీ కోసమే అఖిలేష్, మాయావతి జత కట్టలేదని కేవలం అస్థిత్వం కోసమేనని శనివారం ఇక్కడ విరుచుకుపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ కూటమి ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఒంటిరిగా ఎదుర్కొనే ధైర్యం లేక కూటమి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్, మాయావతి ప్రకటనను ఎద్దేవా చేశారు. బీజేపీ నేత, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య మాట్లాడుతూ ‘ఎస్పీ-బీఎస్పీ కూటమి పచ్చిఅవకాశ వాదం. అవినీతి, గూండాయిజం కలగలిసిన కూటమి’అని తీవ్రంగా విరుచుకుపడ్డా రు. రాష్ట్ర ప్రజలందరూ మోదీ, బీజేపీ వెంటే ఉన్నారని 2014 కంటే మంచి ఫలితాలు తాము సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలన్నీ మోదీ వెనకే ఉన్నారని ఆయన తెలిపారు.