జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేశాయ. అఖిలేష్, మాయావతి కూటమితో పార్టీ అధినాయకత్వం కదిలింది. ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సహా పలువురు సీనియర్లు ఆదివారం లక్నోకు తరలివస్తున్నారు. తాజారాజకీయ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని పార్టీ నేతలు ఖరారు చేస్తారు.‘గులాం నబీ ఆజాద్, పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ నగరానికి వస్తున్నారు. పార్టీ నేతలతో భేటీ అయి కార్యాచరణ రూపొందిస్తారు’అని పీపీసీ అధికార ప్రతినిధి అన్షు అవస్థీ శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. పీసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శులు అందరూ సమావేశానికి హాజరవుతారని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటనతో కాంగ్రెస్‌కు ద్వారాలు మూసుకుపోయాయి. దీంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పార్టీ ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే అదే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా యూపీలో ఒంటిగానే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. భావసారుప్యత గల పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ మీడియా కోఆర్టినేటర్ రాజీవ్ బక్షీ స్పష్టం చేశారు.