జాతీయ వార్తలు

బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశ రాజధానిలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ సదస్సు ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో శుక్ర, శనివారాల్లో జరిగిన సదస్సులో పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగాలు పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోవడమే కాకుండా వారికి నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సదస్సుకు ఆ పార్టీ నాయకులు హాజరయ్యారు. మాజీ కేంద్ర మంత్రి, సినీనటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పట్ల దేశ ప్రజలు సానుకులంగా ఉన్నారని, మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల నుంచీ ప్రధానికి ప్రశంసలు వస్తున్నాయని కృష్ణంరాజు చెప్పారు. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో కార్యకర్తలకు మార్గదర్శకం చేశారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కేడర్‌కు అమిత్ షా పిలుపునిచ్చారని అన్నారు. ఏన్డీయే ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా అవినీతి రహిత పాలన అందించిన విషయాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ‘మరోసారి మోదీ.. మరోసారి బీజేపీ’ నినాదంతో పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రెట్టించిన ఉత్సాహంతో గంతలోకంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడానికి పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీజేపీని మరోసారి ఎందుకు ఎన్నుకోవాలన్న విషయాన్ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్లాలన్నదే తమ ప్రధాన అజెండా అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను నాశనం చేస్తోందని బీజేపీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తన ప్రసంగంలో తిప్పికొట్టారని బాల సుబ్రహ్మణ్యం వెల్లడించారు.