జాతీయ వార్తలు

ఎస్పీకి 38 ,బీఎస్పీకి 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: దేశంలోనే అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్‌లో బద్ధవిరోధులైన అఖిలేష్ యాదవ్, మాయావతి జతకట్టారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే ఏకైక అజెండాగా అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పడానికి ఉదో ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. యూపీ సంగతి అటుంచితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సాగనంపడమే ప్రధాన లక్ష్యంగా ఇరువురు నేతలూ పొత్తుకు అంగీకరించారు. ఎప్పటి నుంచో ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల పొత్తుపై ఊహాగానాలు వచ్చాయి. పలుదఫాలుగా ఇరుపార్టీల అధినేతల చర్చలు తరువాత కూటమిపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. ఎస్పీ వర్గాలు గత వారమే దీనిపై ఓ ప్రకటన చేసింది. శనివారం అఖిలేష్ యాదవ్, మాయావతి సంయుక్త విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కూటమి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం పార్లమెంట్ స్థానాలు 80. అమేధీ, రాయ్‌బరేలీ స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పెట్టకూడదని కూటమి నేతలు నిర్ణయించారు. ఆ రెండు చోట్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్పీ 38-బీస్పీ 38 స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. అమేధీ, రాయ్‌బరేలీ పోను మిగతా రెండుచోట్ల కూటమి మిత్రపక్షాలు పోటీ చేస్తాయని అఖిలేష్, మాయావతి ప్రకటించారు. ఇరుపార్టీల మధ్య రెండు దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పక్కన బెట్టి బీజేపీని ఓడించడమే ప్రధాన అజెండాగా పొత్తు పెట్టుకున్నాయి. ‘బీజేపీ ప్రజాకంటక పాలన చేస్తోంది. కమలనాథుల విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని ఎస్పీతో పొత్తుకు ముందుకొచ్చాం’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. అఖిలేష్ సమక్షంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాచాటుతామని ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తును రాజకీయ విప్లవంగా ఆమె అభివర్ణించారు. 1993 ఎన్నికల్లో రామమందిరం నినాదంతో బీజేపీ ఎన్నికల్లో గెలిచినా దాన్ని అధికారంలోకి రాకుండా ఎస్పీ,బీఎస్పీ అడ్డుకున్నాయని ఆమె గుర్తుచేశారు. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందని మాయ చెప్పారు. 167 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారని ఆమె పేర్కొన్నారు. బీఎస్పీకి 67, ఎస్పీకి 109 సీట్లు వచ్చాయని ఆమె చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదు. మీరాబాయ్ మార్గ్ గెస్ట్‌హౌస్ ఘటన ఇరుపార్టీల్లోనూ చిచ్చుపెట్టింది. ఎస్పీ కార్యకర్తలు మాయవతిపై దాడి చేసి ఆమె ఉంటున్న గదిని ధ్వంసం చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆమెను కాపడలేకపోయారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్త ద్వివేది బీఎస్పీ అధినేత్రి మాయావతిని గెస్ట్‌హౌస్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తరువాత మాయావతి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎస్పీ, బీఎస్పీ మధ్య సంబంధాలు లేవు.
ఇప్పుడు మళ్లీ 23 ఏళ్ల తరువాత బీఎస్పీ, ఎస్పీ ఎన్నికల్లో కలిసిపోటీ చేస్తున్నాయి. బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించడంతో ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మనుగడ ప్రశ్నార్థకమైంది. గోరఖ్‌పూర్ ఫూల్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలు రెండు పార్టీల సఖ్యతకు దారిచూపాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈరెండు చోట్లా బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ నాయకత్వంలోని ఎస్పీ ఐదు ఎంపీ సీట్లు దక్కించుకోగా బీఎస్పీకి ఒక్కచోటా గెలవలేదు. తరువాత 2107 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు చెరో 22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడిక రెండు పార్టీలు కూటమిగా ఏర్పడినందున ముస్లీం ఓట్లు, బీజేపీ వ్యతిరేక ఓట్లు కచ్చితంగా తమకే పడతాయని ఎస్పీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెత్తనాన్ని ఆపడానికే తాము కూటమిగా ఏర్పడ్డామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దళిత, బహుజన ఓట్లు తమకే పడతాయని బీజేపీకి ఓటమి ఖాయమైపోయిందని ఆయన జోస్యం చెప్పారు. ఇలా ఉండగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్‌పై బీఎస్పీ అధినేత్రి నిప్పులు చెరిగారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) పేరుతో శివపాల్ పార్టీ స్థాపించారు. బీజేపీ అండదండలు, నిధులు శివపాల్‌పార్టీకి అందుతున్నాయని మాయవతి విమర్శించారు. అయితే శివపాల్‌పై అఖిలేష్ ఎలాంటి విమర్శలు చేయలేదు.

చిత్రాలు.. ఇరు పార్టీల పొత్తు ప్రకటన తర్వాత అలహాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న బీఎస్పీ, ఎస్పీ శ్రేణులు,
*వారణాసి వీధుల్లోకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్న ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు