జాతీయ వార్తలు

సంఘ ప్రముఖులపై కాంగ్రెస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు. రాహుల్ అధ్యక్షతన గత వారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ నాయకత్వం లోక్‌సభ ఎన్నికలకోసం గ్రామస్థాయిలో ప్రజలను ప్రభావితం చేసేందుకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ పార్టీ సమాజంలోని వివిధ వర్గాల నాయకులు, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు, ఆయా రంగాల్లో ప్రముఖులు, వ్యాపార సంఘాల ప్రముఖులు, ఇతర ప్రముఖులను ప్రచార బరిలోకి
దించేందేకు వ్యూహం పన్నుతోంది. రాహుల్ ఆదేశం మేరకు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు జాతీయ ప్రధాన కార్యదర్శులు దాదాపు వంద మందితో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, ఇతర ప్రముఖలను గుర్తించే పని ప్రారంభించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, అనుబంధ సంస్థలను కూడా ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. దేశ రాజధాని ఢిల్లీలో మార్చి మొదటి వారంలో జరిగే ఒక పెద్ద కార్యక్రమంలో పార్టీ గుర్తించిన వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖలతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభలోని మొత్తం 533 నియోజకవర్గాల వారీగా ప్రముఖుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ తరపున ఆధునిక ప్రచార వ్యవస్థ పని చేయాలన్నది రాహుల్ లక్ష్యమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఆధునిక యాజమాన్య నిర్వహణా పద్ధతులను అమలు చేయాలని పార్టీ అధ్యక్షుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రముఖులను గుర్తించి పార్టీ ఎన్నికల ప్రచారంలో వీరి సేవలను ఉపయోగించుకోవాలన్నది రాహుల్ ఆలోచన. ఆయా కుల సంఘాల నాయకులను కూడా రంగంలోకి దించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. సమీకృత ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ తెర లేపుతుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన ప్రచారానికి పూర్తి భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉంటుందని వారంటున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినందున కాంగ్రెస్ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకోకపోవచ్చు. రాహుల్ గాంధీ ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన కార్యదర్శుల కమిటీ జనవరి నెలాఖరుకు పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తారు. రాహుల్ గాంధీ ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల ప్రచార కార్యాచరణ పథకానికి రూపకల్పన చేస్తారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.