జాతీయ వార్తలు

సామరస్యం అయోధ్య అభిమతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: మూడువేల మూడొందల సంవత్సరాల ఘనకీర్తి ఆ పట్టణం సొంతం. భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి తరతరాలుగా మూలకందంగా భాసిల్లుతున్న పవిత్ర నగరం అది. తరాలు అంతరిస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని ఆకట్టుకుంటూ భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న అయోధ్య నగర వైశిష్ట్యం నిరుపమానమే. శ్రీరాముడు జన్మించిన స్థలంగా గణతికెక్కిన అయోధ్య నగరం గురించి తాజాగా వెలువడిన ఓ పుస్తకం ఎన్నో లోతైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నగరం కేవలం రామాలయ వివాదంతోనే ముడివడి లేదని దీని ప్రాధాన్యత మతాలకు అతీతమని ఈ పుస్తక రచయిత, ప్రముఖ పాత్రికేయుడు వలయ్ సింగ్ స్పష్టం చేశారు. అయోధ్య చరిత్ర, దాని గొప్పతనానికి ఆయన పుస్తక రూపం ఇచ్చారు. ‘అయోధ్య- సిటీ ఆఫ్ ఫెయిత్, సిటీ ఆఫ్ డిస్కార్డ్’ పేరుతో సింగ్ పుస్తకాన్ని రాశారు. ఇటీవలే ఆవిష్కృతమైన పుస్తకంలో అయోధ్య మహోన్నత, మనోహరమైన చరిత్ర రామమందిర వివాదంతో మరుగున పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘అయోధ్యకు విస్తృతమైన ఘన చరిత్ర ఉంది. బుద్ధిజం, ఇస్లాం, జైనిజంతో నగరానికి అనుంబంధం ఉంది’అని రచయిత పేర్కొన్నారు. నగరంలో
పర్యటించిన అనేక మంది చైనా యాత్రికులు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. అలాగే జైనుల ప్రముఖ యాత్రా స్థలంగా అయోధ్య విరాజిల్లింది. అమిర్ ఖుస్రో అనే యాత్రికుడు అయోధ్య గురించి ఈ విషయాలన్నీ రాశాడు. నగర ఘన చరిత్రతోపాటు జానపదాలు రానురాను తెరమరుగయ్యాయని రచయిత తెలిపారు. మందిర వివాదం తెరపైకి రావడంతో చరిత్ర వౌనంగా చూస్తూ ఉండిపోయిందని సింగ్ ఆవేదన చెందారు. రానురాను వాస్తవ చరిత్ర మరుగున పడిపోయి కల్పిత కథలు తెరమీదకు వచ్చాయని ఢిల్లీకి చెందిన జర్నలిస్టు సింగ్ పేర్కొన్నాడు. 3,300 సంవత్సరాల చరిత్రను పుస్తకంగా తీసుకొచ్చిన ఆయన 1200 ఏళ్లపాటు రాజులు, ఫకీర్ల పాలనాతీరును ప్రస్తావించారు. అయోధ్య ఉత్తరభారతానికి గుండెకాయ అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని రెండోభాగంలో సింగ్ ప్రస్తావించారు.