జాతీయ వార్తలు

నిష్పాక్షిక ఎన్నికలకు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: నిష్పాక్షికంగా, నిజాయితీగా దేశంలో ఎన్నికలు జరిగేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని ఫేస్‌బుక్ సహా సామాజిక మీడియా సంస్థలకు భారత ఇంటర్‌నెట్, మొబైల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్నికలు నిజాయితీగా, పారదర్శకంగా జరిగేందుకు అత్యంత కీలకంగా మారనున్నాయని పేర్కొంది. ఎన్నికల కమిషన్, సామాజిక మాధ్యమాలకు చెందిన వివిధ కంపెనీలతో కూడిన ప్యానెల్ కమిటీ ఇందుకు తగిన ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గత వారం అందజేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయా మాధ్యమాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో తాము సమర్పించిన సమగ్ర నివేదికపై సానుకూల దృక్పథంతో వ్యవహరించినందుకు ఐఏఎంఏఐ తమ సభ్యుల తరఫున కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. దేశ సమగ్రత, పవిత్రతను కాపాడేందుకు ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిపేందుకు సామాజిక మాధ్యమాలు తగిన సమర్థవంతమైన, కీలకమైన పాత్రను పోషించేందుకు ఒకే వేదికపైకి రావడం ఆశావహ దృక్పథంగా ఏఐఎంఏఐ అభిప్రాయపడింది.