జాతీయ వార్తలు

కేంద్రంలో మేమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 14: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో ఏ ప్రభు త్వం ఏర్పాటవుతుందో నిర్ణయించేదీ బిహార్, యూపీలేనని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. యూపీలో ఎస్పీ,బీఎస్పీ ఎన్నికల పొత్తు నేపథ్యంలో సోమవారం ఆయన ఇక్కడ మీడియాతోమాట్లాడారు. ఇది ఒక్క యూపీకే కాదు దేశంలో ఇలాంటి పొత్తులు ఏర్పడతాయని ఆయన చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండాలో నిర్ణయించేది బిహార్, యూపీ ప్రజలేనని ఆయన అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయిన తరువాత తేజస్వీ విలేఖరులతో మాట్లాడారు. ఆదివారం రాత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ తేజస్వీ సమావేశమయ్యారు. ‘యూపీలో 80 లోక్‌సభ స్థానాలుంటే బీహార్‌లో 40 స్థానాలున్నాయి...పక్కనున్న జార్ఖండ్‌లోని 14 స్థానాలు, మూడు రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుకొంటే 134. గత ఎన్నికల్లో బీజేపీ 115 లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిచింది’అని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు కుదిరితే బీజేపీ వంద సీట్లను కోల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కమలనాథుల పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని ఆయన విమర్శించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ దగా చేశారని యాదవ్ ఆరోపించారు. సీఎం నితీష్‌కుమార్ రాజకీయ ప్రయోజనాల కోసమే తమతో విడిపోయి బీజేపీతో జతకాగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.‘యూపీలో బీస్పీ-ఎస్పీ ప్రయో గం మున్నుందు మంచి ఫలితాలను సాధించిపెడుతుంది. ఆర్‌ఎస్‌ఎస్ బారి నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఆ పొత్తు మార్గదర్శకత్వం వహిస్తుందని ఆర్జేడీ అధినేత స్పష్టం చేశారు. యూపీలో బీఎస్పీ-ఎస్పీ కూటమిని ఆర్జేడీ స్వాగతిస్తోందని తమ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అభిమతం కూడా అదేనని ఆయన కుమారుడు తేజస్వీ స్పష్టం చేశారు. బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. ఎంఎస్ గోవాల్కర్ సిద్ధాంతాలు, నాగ్‌పూర్ చట్టాలను జొప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆర్జేడీ అధినేత తీవ్ర విమర్శ చేశారు. ఈడీ, సీబీఐను రాజకీయ విరోధులపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ , పక్కన అఖిలేష్