జాతీయ వార్తలు

అగ్రవర్ణ పేదలకు పదిశాతం ఈబీసీ కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 18: ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటాను వర్తింపచేస్తున్నట్లు యూపీ మంత్రి వర్గం ప్రకటించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ వివరాలను మంత్రివర్గం తరఫున ప్రతినిధి శ్రీకాంత శర్మ విలేఖర్లకు తెలిపారు. దేశంలో ఇంతవరకు గుజరాత్, జార్కండ్ ప్రభుత్వాలు ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కోటాను అమలు చేసే రాష్ట్రాల్లో యూపీ మూడో స్థానంలో నిలిచింది. 124వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ సవరణ కింద ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ కూడా బిల్లుపై సంతకం చేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈబీసీ కోటా అమలులోకి వస్తుందని ప్రతినిధి శ్రీకాంత శర్మ చెప్పారు. రాష్ట్రంలో 49 వర్శిటీలు ఉన్నాయని చెప్పారు. ఇందులోనాలుగు సెంట్రల్ వర్శిటీలు , 15 రాష్ట్ర స్థాయివర్శిటీలు, 27 ప్రైవేట్ వర్శిటీలు ఉన్నాయి. మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 44వేల సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగంలో అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈబీసీ కోటా కింద పది శాతం రిజర్వేషన్లను అమలుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు యూపీ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ చెప్పారు.